క‌రోనా ఎఫెక్ట్ః సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో లాక్‌డౌన్‌

తెలంగాణ‌లో క‌రోనా కోర‌లు చాస్తున్న టైమ్‌లో ఇప్ప‌టికే ప‌లు జిల్లాలు, న‌గ‌రాలు స్వ‌చ్ఛంద లాక్‌డౌన్ విదించుకున్నాయి. ఇక ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ లో కూడా స్వ‌చ్ఛంద్ లాక్‌డౌన్ విధించారు. ఈ మండ‌ల ప‌రిధిలోని ప‌లు గ్రామాలు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నాయి.

మండ‌ల ప‌రిధిలోని మ‌ర్కూక్‌, ఎర్ర‌వ‌ల్లి, కొడ‌కండ్ల‌, పాముల‌ప‌ర్తి త‌దిత‌ర గ్రామాలు ఈ రోజు పంచాయ‌తీ తీర్మాణం చేశాయి. ఆయా గ్రామాల్లో వారం రోజుల పాటు స్వ‌చ్ఛంద లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు స‌ర్పంచులు తెలిపారు. ఇక ఈ లాక్‌డౌన్ ను గ‌జ్వేల్ అధికారులు కూడా ఆమోదించిన‌ట్టు స‌మాచారం.