తెలంగాణ‌పై క‌రోనా పంజా.. నేడు 2,398 కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రం పై క‌రోనా పంజా విసురుతుంది. రోజు రోజుకు క‌రోనా వ్యాప్తి పెరుగుతుంది. దీంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న పెరుగుతుంది. ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 క‌రోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్ర‌జ‌లు జగ్ర‌త్త గా ఉండాల‌ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు తాజా గా 2,398 కరోనా కేసులు న‌మోదు అయ్యాయి.

corona
corona

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌రోనా కేసుల సంఖ్య 7,05,199 కు చేరింది. అలాగే రాష్ట్రంలో నేడు ముగ్గురు క‌రోనా కాటుకు మృత్యువాత ప‌డ్డారు. అయితే రాష్ట్రంలో ప్ర‌స్తుతం మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్ర‌తి రోజు ఒక‌రు లేదా ఇద్ద‌రు క‌రోనా తో మ‌ర‌ణించే వారు. కానీ నేడు ఏకంగా ముగ్గురు క‌రోనాతో పోరాడి మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,052 కు చేరింది. కాగ ఈ రోజు రాష్ట్రంలో అత్య‌ధికంగా 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.