తెలంగాణ రాష్ట్రం లో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. గతంలో కోర్ట్ ఇచ్చిన ఆదేశాల అమలు, రాష్ట్రంలో ఉన్న కేసులు వివరాల పై ఆరా తీయనున్న హైకోర్టు…. ఏమైనా కొత్త ఆదేశాలు ఇస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై వైద్య శాఖ, పోలీస్ శాఖ నివేదిక ఇస్తుంది.
ఈ నెల 14 న రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రీలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీని పోలీసులు సమర్పించే అవకాశం ఉంది. మూడు కమిషనరేట్స్ పరిధిలోని వీడియో గ్రఫీ ని కోర్ట్ కు పోలీసులు సమర్పించే అవకాశం ఉంది. నేడు కరోనాకు సంబంధించిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపడుతుంది.