బీఆర్‌ఎస్‌ పై గుత్తా వివాదస్పద వ్యాఖ్యలు..బెదిరిస్తున్నారంటూ !

-

బీఆర్‌ఎస్‌ పై మండలి చైర్మన్ గుత్తా గుత్తా సుఖేందర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీఅరెస్ అధికారం కోల్పోగానే అధికారులను ఉదేశించి అంతు చూస్తాం అంటున్నారని… అధికారులు పర్మనెంట్, రాజకీయా నాయకులు టెంపరరీ అంటూ సెటైర్లు ఏల్చారు. రాజకీయ నాయకుల లూప్ హొల్స్ అధికారులకు బాగా తెలుసు అన్నారు. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి.. ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందని తెలిపారు.

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ బాధ్యులే అన్నారు. ప్రతిపక్ష నాయకులు వాడుతున్న బాషా సరిగా లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వాడుకోని .. ఇంకేమైనా వాడుకోని.. పద్దతి ఉండాలని కోరారు. ఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దని పేర్కొన్నారు. మూసి ప్రక్షాళన కూడా అంతేనని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన పై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్‌ కు చురకలు అంటించారు మండలి చైర్మన్ గుత్తా గుత్తా సుఖేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version