అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లి.. నీ కొలువుల పండుగ కథలు చెప్పు..? – కేటీఆర్‌

-

అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లి.. నీ కొలువుల పండుగ కథలు చెప్పు..? అంటూ కేటీఆర్‌ సెటైర్లు పేల్చారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నదని… నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..? అంటూ ఆగ్రహించారు. ప్రజా ధనాన్ని తగలేసి…ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..?అంటూ రేవంత్‌ రెడ్డి పై రెచ్చిపోయారు.

ktr revanth

గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా అంటూ మండిపడ్డారు. తెలంగాణ యువత ను పిచ్చోళ్లను చేస్తున్నావా…? అశోక్ నగర్ చౌరస్తాకు..ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెప్తవా నీ కొలువుల పండుగ కథలు..?అంటూ రేవంత్‌ రెడ్డిని నిలదీశారు. ఏడాదిలో 2 లక్షల కొలువులు గ్యారెంటీఅని.. నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక..తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version