తెలంగాణా మంత్రులకు, స్పీకర్ కు కోర్ట్ బిగ్ షాక్…!

Join Our Community
follow manalokam on social media

ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విషయంలో న్యాయస్థానాలు స్పీడ్ పెంచాయి. తాజాగా తెలంగాణా స్పీకర్ సహా మంత్రులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2005లో తెదేపా నిర్వహించిన ఆందోళన కేసులో పోచారం సహా పలువురికి సమన్లు జారీ చేసారు. వరంగల్ లోని సుబేదారి పీఎస్ పరిధిలో ఆందోళనకు దిగిన కేసులో సమన్లు జారీ చేసారు.

వరంగల్ కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ చేసారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరికి సమన్లు జారీ చేసారు. ఎస్.వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డికి సమన్లు జారీ చేసారు. మార్చి 4న హాజరు కావాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.

2016లో నిర్వహించిన ఆందోళనలో కేపీ వివేకానందకు సమన్లు జారీ చేసారు. ఎమ్మెల్యే వివేకానంద రాష్ట్రంలో లేరని కోర్టుకు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. వివేకానందకు వాట్సప్ లేదా మెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. విచారణ మార్చి 8కి ప్రజా ప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల మీద కూడా కోర్ట్ దృష్టి పెట్టింది. త్వరలో కొందరికి సామాన్లు రానున్నాయి.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...