రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హై కోర్టు రంగంలోకి దిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై నేడు మరోసారి హై కోర్టులో విచారణ జరగనుంది. హై కోర్టులో ఇప్పటికే కొవిడ్ పై విచారణ జరుగుతుంది. ఈ నెల 12 వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై ఒక నివేధికను కూడా హై కోర్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు సమర్పించారు. నేడు ఈ రిపోర్టు ఆధారంగా హై కోర్టులో విచారణ జరగనుంది.
కాగ ఆదివారం జరిగిన విచారణలో రాష్ట్రం లో కరోనా వైరస్ ను అదుపులోకి తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టినట్టు డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. అలాగే ఈ నెల 12 వరకు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు ఉంది. అలాగే జీహెచ్ఎంసీ లో 5.65 శాతం ఉందని వివరించారు. అలాగే అయితే కేంద్ర ప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం పది శాతం మించి పాజిటివిటీ రేటు ఉంటే.. నైట్ కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు పది శాతం వరకు వస్తే.. నైట్ కర్ఫ్యూ, కార్యాలయాల్లో సిబ్బంది, ప్రజా రవాణా వ్యవస్థ తగ్గింపు తో పాటు మరి కొన్ని ఆంక్షలు విధిస్తామని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. అలాగే ఈ నెల 1 నుంచి 12 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18,196 కరోనా కేసులు వెలగు చూశాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 2.76 శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు.