ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై చర్చ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ అయ్యారు.
కాగా, ఈ నెల 27వతేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ స్దానానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమయం ముగియనుంది.
ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగర్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా, మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 1,74,794 మంది, పురుషులు 2,87,007 మంది, ట్రాన్స్‌జెండర్లు ఐదుగురు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం పట్టభద్రుల ఓటర్ల సంఖ్య… నల్లగొండ జిల్లాలో 1,65,778 మంది, ఖమ్మం జిల్లాలో 1,23,504 మంది, వరంగల్ జిల్లాలో 1,67,853 మంది, సిద్దిపేట జిల్లాలో 4,671 మంది ఉన్నారు.