Telangana: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య…రేవంత్‌ ను ఉద్దేశించి వీడియో పెట్టి మరీ ?

-

తెలంగాణ రాష్ట్రంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతకాని మండలం పొద్దుటూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్థాపనతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా తెలియజేశాడు మృతుడు.

crime in khammam

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య చరణ్యమని పురుగుమందు తాగి మృతి చెందారు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news