హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ఠ్. హైదరాబాద్ లో నెల రోజులు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ అయింది. పోలీసు కానిస్టేబుళ్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం అందుతోంది. ఆదివారం రాత్రి నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని ఈ ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం.
ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో చూడాలి. అదే సమయంలో తెలంగాణలో 10 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ డిస్మిస్ అయ్యారు. ఆందోళన చేస్తున్నవారిపై పోలీసుశాఖ చర్యలు తీసుకుంది.. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. బెటాలియన్స్‌లో అశాంతికి 10 మంది కానిస్టేబుల్స్ కారణమని ఆరోపణలు వస్తున్నాయి.. ఇటీవలే 39 మందిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.