యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లు కలిగిన ఆహారాన్ని శరీరం జీర్ణం చేసుకునేటపుడు వెలువడే వ్యర్థ పదార్థం. యూరిక్ యాసిడ్ ని కిడ్నీలు ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా శరీరంలోంచి బయటకు పంపివేస్తాయి.
ఒకవేళ మీరు ప్యూరిన్లు ఎక్కువగా కలిగిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడం కిడ్నీలకు కష్టమైపోయి.. యూరిక్ యాసిడ్ శరీరంలో మిగిలిపోతుంది.
యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. పొద్దున్న లేవగానే నడవరాకపోవడం, కీళ్ళలో నొప్పులు, చీలమండ భాగంలో విపరీతమైన నొప్పి దీని లక్షణాలుగా ఉంటాయి.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం మంచిది. యూరిక్ యాసిడ్ ని నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీల డ్యామేజీకి దారితీసే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.
దానికోసం తక్కువ ప్యూరిన్లు గల ఆహారాలను తీసుకోవాలి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
ఫైబర్ కలిగిన ఆహారాలు:
ఆహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటే శరీరం ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఫైబర్ కలిగిన ఆహారాల్లో ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. ఓట్స్, గుమ్మడికాయ, బ్రోకలీ వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
సిట్రస్ ఫ్యూట్స్ :
విటమిన్ సి కలిగిన పండ్లను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. జామ, ఉసిరి, నిమ్మ, చెర్రీస్ మొదలగు పండ్లను తినాలి.
ఇంకా, కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు, రైస్, బంగాళదుంపలు, పీనట్ బట్టర్ మొదలగు వాటిని ఆహారంలో చేర్చుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.