Warangal: ఎంజీఎంలో కరెంట్ కోతలు తగ్గడం లేదు. దీంతో రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ లేక సెలైన్ బాటిల్ పట్టుకుని బైటికొచ్చారు రోగులు. ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు అయిదు గంటలకు పైగా కరెంటు లేక అవస్థలు పడుతున్నారు రోగులు, వైద్యులు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 4.30 గంటలకు పోయిన కరెంటు.. రాత్రి 9.30 గంటలకు వచ్చింది. చాలా వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు బయటకు వచ్చారు. వేసవి ఉక్కపోతకు ఇబ్బంది పడ్డారు. కరెంట్ పోవడానికి గల కారణాలు తెలియాల్సివుంది.