హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ గా సీవీ ఆనంద్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం రాత్రి భారీగా ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేసింది. అందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌రానికి పోలీసు క‌మిష‌న‌ర్ గా సీవీ ఆనంద్ ను నియ‌మించింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ గా ఉన్న అంజ‌నీ కుమార్ ను ఏసీబీ జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్ గా బ‌దిలీ చేసింది. అలాగే వెస్ట్ జోన్ డీసీపీ గా జోయ‌ల్ డేవిడ్ ను నియ‌మించింది. జోయ‌ల్ డేవిడ్ ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధిపేట్ క‌మిష‌న‌ర్ గా విధులు నిర్వ‌హించాడు. వీటితో రాష్ట్రంలో భారీ ఎత్తున బ‌దిలీలు జ‌రిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అడిషన‌ల్ సీపీ క్ర‌మ్స్ గా ఉన్న శిఖా గోయ‌ల్ ను ఏసీబీ డైరెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు.

మొత్తంగా 30 ఐపీఎస్ ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. అంతే కాకుండా దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. కాగ హైద‌రాబాద్ సీపీ గా వ‌స్తున్న సీవీ ఆనంద్ ఇప్ప‌టి వ‌ర‌కు వెయిటింగ్ లో ఉన్నాడు. అయితే దానికి ముందు కేంద్ర స‌ర్వీస్ లలో ఉన్నాడు. అయితే ఇటీవ‌ల ఆయ‌న‌ను తెలంగాణ రాష్ట్ర క్యాడ‌ర్ కు పిలిపించారు. త‌న‌కు కీలక బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని హామీ ఇచ్చి రాష్ట్ర క్యాడ‌ర్ కు తీసుకువ‌చ్చార‌ని తెలుస్తుంది. అయితే సీవీ ఆనంద్ గ‌తంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ డిపాట్మెంట్ కు చీఫ్ గా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. దీంతో ఆయ‌న హైద‌రాబాద్ పై పూర్తి గ్రిప్ ఉంది.