సాధారణంగా హైదరాబాద్ నగరంలో వీకెండ్ అయితే అయితే చాలా కొన్ని ప్రాంతాల్లో బైకు స్టంట్లు చేస్తుంటారు. వీకెండ్ లో ఎక్కువగా సరదాగా గడుపుతున్న విషయం తెలిసిందే. కొన్ని సందర్బంగా ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేశారు. ముఖ్యంగా రాత్రి అయితే చాలు రయ్ రయ్ మంటూ ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు యువత.
ఇటీవల టీ హబ్ వద్ద బైక్ స్టంట్లు చేశారు. దాదాపు 40 బైక్స్ ను సీజ్ చేశారు పోలీసులు. తాజాగా.. రోడ్డుపై అడ్డదిడ్డంగా రెండు చక్రాలపై ఆటోరిక్షాను నడుపుతూ స్టంట్లు చేశాడు ఓ ఆటో వాలా. ప్రధానంగా బైక్ రేసింగ్ లు, స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా అవేమి పట్టకుండా వ్యవహరిస్తున్నారు యువత.