తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ అవసరమయ్యే సిబ్బంది కోసం ప్రత్యేక నియామకాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో, ఔట్ సోర్సింగ్ విధానంలో 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి వైద్యరోగ్య శాఖ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఎంపికైన అభ్యర్థుల 5 నెలల పాటు ఆయా జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ లలో డిప్లమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్లుగా రెండేళ్ల పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 16 తేదీన కింది అడ్రస్ లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.