ఏపీఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డికి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల లేఖ రాశారు. డిస్కంల వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై వినియోగదారుల అభ్యంతరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బహిరంగ విచారణ జరపాలన్నారు. ఏఆర్ఆర్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ ఏర్పాటు చేసి వినియోగదారుల నుంచి నేరుగా, రాతపూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడం ఆనవాయితీ అని లేఖలో పయ్యావుల వెల్లడించారు.
ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వడం వినియోగదారుల హక్కులు కాల రాయడమే.కరోనా నిబంధనలు సడలించినప్పటికీ అభ్యంతరాలపై బహిరంగ విచారణను వీడియో కాన్పెరెన్సు ద్వారా మాత్రమే నిర్వహిస్తే సామాన్యులను విచారణకు దూరం చేయడమేన్నారు.
గతంలో విచారణ బహిరంగంగా జిల్లాలలో జరిగేది.మరి ఈ ఏడాది కేవలం వీడియో కాన్పెరెన్సు ద్వారా మాత్రమే విచారణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించడం అప్రజాస్వామికమని చెప్పారు. విద్యుత్ నియంత్రణ చట్టం స్పూర్తికి విరుద్దం.మెజిస్ట్రేట్ నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని విచారణలు బహిరంగంగా జరుగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు విచారణలు కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న సమయంలో ఈఆర్సీ విచారణను వీడియో కాన్పెరెన్స్ కే పరిమితం అవడం వినియోగదారుల ప్రయోజనాలకు గండి కొట్టడమే అని పేర్కొన్నారు.