నేడు హైదరాబాద్ ISB ద్విదశాబ్ది వేడుకలకు చంద్రబాబు

-

హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో గత 20 యేళ్ల క్రితం నెలకొల్పిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇది 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో ప్రారంభమైంది.

ISB @ 20: Chandrababu Naidu's Breakfast Diplomacy Changed The Face Of Hyderabad

ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు స్కూల్ అధికారులు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. కాగా, వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం విద్యార్థులతో జరిగే ముఖాముఖిలోనూ పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news