కేటీఆర్ చేసినన్నీ తప్పులు దావుద్ ఇబ్రాహీం కూడా చేయలేదు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

-

మున్సిపల్ మంత్రి గా కేటీఆర్ చేసినన్ని తప్పులు దావుద్ ఇబ్రహీం కూడా చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మీర్ ఆలం ట్యాంక్ లో కబ్జాల సంగతి ఎంటి..?  వాటిని ఎప్పుడు కూల గొడతారు అని ప్రవ్నించారు. N కన్వెన్షన్ వివిధ ఫంక్షన్లకు ఇచ్చి తీసుకున్న డబ్బులను వసూల్ చేస్తారా..? N కన్వెన్షన్ ను ఎందుకు గత ప్రభుత్వం కాపాడింది అన్నారు.

నాగార్జున కోడలు ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు పెట్టారు. టీఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు కట్టిన అక్రమ కట్టడాలను ముందు కూల గొట్టండి. 111 జీఓ పరిధిలో హరీష్ రావు , కవిత లకు ఆస్తులు లేవా.. వాటి సంగతి ఏంది..? కేటీఆర్ జన్వాడా ఫార్మ్ హౌస్ ను ఎప్పుడు కూల గోడతారు..? BRS ఎమ్మెల్యేల ఆస్తులు కూడా ఉన్నాయి మరీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news