ఇవాళ రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ ఉద్యోగుల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే TSRTC కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు బంద్ కు పిలుపుఇచ్చారు.
దీంతో నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు. అంతేకాదు రాజ్ భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ…ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్టీసీ కార్మికులు.