బీఆర్ఎస్ నేతలు సౌధ పత్రంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన పొన్నం ప్రభాకర్ ప్రజాపాలనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందన్నారు. తెలంగాణ అప్పులపై సౌధ పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు, ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌధ పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రతినెల ఒకటవ తేదీ నుంచి 5వ తేదీ లోపు జీతాలు అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నారు. త్వరలోనే తెలంగాణకు ఆర్టీసీకి కొత్త బస్సులను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.