వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేసేది ఇతనే?

-

మరో రెండు రోజుల్లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ ఇండియా వేదికగా స్టార్ట్ కానుంది. ఈ వరల్డ్ కప్ లో మొత్తం పది జట్లు టైటిల్ కోసం తీవ్రంగా పడనున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 19వ తేదీ వరకు జరగనున్న ఈ వరల్డ్ కప్ లో ఎవరు ఈ వరల్డ్ కప్ ను గెలుచుకోనున్నారు అన్నది చాలా ఆసక్తిగా ఉంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు సాధించే ఆటగాడు ఎవరన్నా ప్రశ్నకు సమాధానంగా ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ చెప్పిన ఆటగాడు పేరు తెలిస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయం. మాములుగా గంభీర్ ఇండియా ప్లేయర్ లేవడం వలన అందరూ ఇండియా ప్లేయర్ పేరు చెబుతారని ఆశించారు. కానీ గంభీర్ మాత్రం అందరి అంచనాలకు విరుద్ధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ మరియు కీపర్ గా ఉన్న జాస్ బట్లర్ పేరు చెప్పడం విశేషం.

ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు బట్లర్ చేసే అవకాశం ఎక్కవగా ఉందని గంభీర్ చెప్పాడు. మరి గంభీర్ చెప్పినట్లుగా బట్లర్ అత్యధిక స్కోర్ ను సాధిస్తాడా లేదా ఇండియా నుండి ఎవరైనా ప్లేయర్ ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు సాధిస్తాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news