పెద్దాపూర్ గురుకులంలో పేరెంట్స్ తో డిప్యూటీ సీఎం భేటీ..!

-

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులానికి ఇవాల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. ఈ పాఠశాలలో జరిగే పేరెంట్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన మృతుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు ఎలా చనిపోయారో చెప్పాలని, ఆధారాలుంటే చూపించాలని కోరారు. తమ పిల్లల మృతికి ఉపాధ్యాయులు చేసిన నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. దీంతో భట్టి వారిని ఓదార్చారు. కొద్ది రోజుల కిందట పెద్దాపూర్ గురుకులంలో పాము కాటుతో ఇద్దరూ విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో భట్టి ఇద్దరూ విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థులు అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను పాఠశాల ఇన్ చార్జీ ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకున్నారు మంత్రులు. పాఠశాలలో వసతులు, సిబ్బంది, డ్యూటీ నర్స్ కి సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

 

Read more RELATED
Recommended to you

Latest news