హైదరాబాద్ క్రైమ్ రేట్ పై అసత్య ప్రచారం..!

-

హైదరాబాద్ క్రైమ్ రేట్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు అని సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పెట్టిన ప్రెస్ మీట్ లో డీజీపీ జితేందర్ తెలిపారు. కొంత మంది కావాలని పోలీసులను నిందిస్తున్నారు. హైదరాబాద్ లో క్రైమ్ రేట్ పెరగలేదు కానీ పెరిగిందని ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. గతేడాది హైదరాబాద్ లో 48 హత్యలు జరిగితే ఈ ఏడాది కూడా 48 హత్యలే జరిగాయి. పోలీస్ సేవలపై ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం అని డీజీపీ అన్నారు.

సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు భేష్ గా ఉంది. వారు బాగా పనిచేస్తున్నారు. జిలాల్లో ప్రాపర్టీ క్రైమ్ రికవరీ, రోడ్డు యాక్సిడెంట్స్ బాగా తగ్గాయి. అలాగే జిల్లాలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. ఇక 100 డయల్ పై చర్చించడం జరిగింది. లాస్ట్ వన్ మంత్ లో ఈ విషయంలో ఇంప్రూవ్ వచ్చింది. అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంది అని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news