కంగువా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..?

-

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టేజియస్ మూవీ కంగువా. ఈ చిత్రం ప్రకటించనప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతీ అప్డేట్ కూడా భారీ అంచనాలను పెంచేస్తోంది. చిరుత్తై శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన విజువల్స్, మూవీ గ్లింప్స్, సాంగ్స్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ తరుణంలో నిన్న తమిళ ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ ట్రైలర్ ఓ మహిళా వాయిస్ తో ప్రారంభమవుతోంది. హీరో సూర్య ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. బాబీ డియోల్, సూర్య డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. దేవీశ్రీ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కానుంది. సూర్య సరసన దిశాపటానీ కథానాయికగా, విలన్ గా బాబీ డియోల్ తమ నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. అక్టోబర్ 10, 2024న రాబోయే ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచెనాలు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news