బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గురించి మంతనాలు..!

-

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్లు దక్కని వారు పార్టీలు మారుతున్నారు. గత మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం ఒంటరిగానే పోటీ చేయనుంది. ఓవైపు కమ్యూనిస్టులు.. మరోవైపు బీఎస్పీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గురించి మంతనాలు జరుగుతున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, బీఎస్పీ ఉండడంతో ఇక్కడ కూడా పొత్తు కుదిరే ఛాన్స్ ఉంది. బీఎస్పీ తెలంగాణలో 10 సీట్లు డిమాండ్ చేసిన బీఎస్పీ.. 2 సీట్లు సర్దుబాటు చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం కోసం ఎదురుచూస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఎస్పీ కీలక నేత ఆర్.ఎస్.ప్రవీణ్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. పొత్తులకు ఒప్పుకుంటే మాత్రం ఇటు బీఎస్పీకి, అటు కాంగ్రెస్ కి లాభం చేకూరుతుంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news