దీపావళి పండుగ అంటే బండ్ల గణేష్ కు పూనకమే..!

-

సాధారణంగా దీపావళి పండుగ అంటే పూజలతో పాటు దీపాలను వెలిగిస్తుంటారు. వీటితో పాటు బాంబులను కాల్చుతుంటారు. బాంబులను కాల్చుతూ కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోయిన వారుంటారు. దీపావళి పటాసులు పేల్చే సమయంలో కళ్లద్దాలను ధరించాలని.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా.. కొన్ని సందర్భాల్లో కావాలని ఇలా ఏదో ఒక విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ ఎప్పటి మాదిరిగానే దీపావళి సెలబ్రేషన్స్ లో తన మార్క్ చూపించేందుకు సిద్ధం అయ్యారు. భారీగా క్రాకర్స్ కొనుగోలు చేశారు. షాద్ నగర్ లోని తన ఇంటి ముందు పరిచి వాటితో ఫొటోకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. దీపావళి పండుగ అంటే బండ్లన్నకు ఇక పూనకమే వచ్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ రాత్రికి బండ్లన్న ఇంటి ముందు బాంబుల మోత భారీగానే ఉందన్న మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version