ఎమ్మెల్సీ కవితపై డీకే అరుణ ఫైర్..!

-

మహిళా బిల్లును ఎమ్మెల్సీ కవిత కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వెళుతున్నట్టు మాట్లాడుతుందని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసులను తప్పుదోవ పట్టించేందుకు నాటకాలు ఆడకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఇచ్చిన హామీలను మోడీ నెరవేరుస్తున్నారని తెలిపారు కేసీఆర్ కవితలు మాట్లాడడం విచారకరమన్నారు అసెంబ్లీ సీట్లు మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు మీరు అని ప్రశ్నించారు. మహిళా అయినా తనపై అడ్డగోలుగా మీ నాయన మాట్లాడారని మండిపడ్డారు డీకే అరుణ. కెసిఆర్ కి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి వస్తేనే పేదలతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ ప్రజలు బిజెపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. గ్యారంటీ ల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలో 4000 పెన్షన్ ఇస్తున్నారా అని మండిపడ్డారు. అభివృద్ధికి నిధులు ఉండవని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారం కోసమే కాంగ్రెస్ హామీలు అమలు కోసం కాదని డీకే అరుణ మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను తప్పి దారి పట్టించమని గ్యారెంటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశము రాష్ట్రాల అభివృద్ధి ద్యేయంగా బిజెపి మోడీ ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news