APలో 2 MPP, 3 MPP ఉపాధ్యక్షులు, 186 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 4న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ATP జిల్లా పెదపప్పురు, YSR జిల్లా లింగాలలో MPP, సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లి, అన్నమయ్య జిల్లా గాలివీడు, AKP జిల్లా S.రాయవరంలో MPP ఉపాధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల పరిషత్ కో-ఆప్షన్, వివిధ జిల్లాల్లో మరో 186 వార్డు సభ్యుల స్థానాలకు సెప్టెంబర్ 4న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇక ఈ తరుణంలోనే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ… రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ‘నా భూమి-నా దేశం’ కార్యక్రమం చేపట్టనుంది. పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయానికి కృషి చేయాలని రాష్ట్ర బిజెపి చీఫ్ పురందేశ్వరి పిలుపునిచ్చారు.