నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్ఏంపీ వైద్యుడి లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతుంది. జిల్లా జనరల్ ఆస్పత్రి ముందు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన వద్దకు వైద్యానికి వచ్చిన మహిళ పై అసభ్యకరంగా మాట్లాడాడు ఆర్ఏంపీ డాక్టర్. నీకు పిల్లలు కాకపోతే నాతో పాటు నా స్నేహితులతో గడిపితే పిల్లలు పుడతారంటూ అసభ్యకరంగా మాట్లాడాడు ఆర్ఎంపీ డాక్టర్ సమీర్. దీంతో ఆస్పత్రిలో వైద్యుడిని నిలదీశారు కుటుంబ సభ్యులు.
అయితే ఈ ఘటనలో ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే సదరు ఆర్ఎంపీ డాక్టర్ పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. దాంతో ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని రోడ్డు పైనే బఠాయించారు ప్రజా సంఘల నాయకులు. ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ అర్హత లేకుండా వైద్యం చేస్తున్నాడని గతంలో అతని హాస్పిటల్స్ సీజ్ చేసారు వైద్యాధికారులు. కానీ అతను మళ్ళీ ఆసుపత్రి ఓపెన్ చేసాడు.