తిరుమలలో గత ప్రభుత్వం నాసిరకం భోజనం పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూల విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. పవిత్రమైన లడ్డూల విషయంలోనూ అపవిత్ర ముడి సరుకు వాడారు అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో అన్ని వ్యవస్థలను మళ్లీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. వెంకన్న సన్నిధిని అపవిత్రం చేసింది గత వ్రభుత్వం. అపవిత్ర ముడి సరుకులు వాడారు.. అదే విషయం ల్యాబ్ టెస్టుల్లో బయట పడింది అని తెలిపారు.
కక్కుర్తికి హద్దులుంటాయి.. కానీ హద్దులు దాటారు. రాజకీయ ప్రయోజనాలకు వెెంకన్నను వాడుకోవడం సరికాదు. తిరుమలను అపవిత్రం చేసిన వాళ్ల గురించి ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటాం. తిరుమల ల్యాబ్ రిపోర్టులో అపవిత్ర పదార్ధాలు వాడారని చెప్పారు. దీనికి కారకులెవరో కనిపెట్టి చర్యలు తీసుకుంటాం. గత ఎన్నికల్లో సైలెంట్ రివల్యూషన్ వచ్చింది.. అందుకే ఇంత పెద్ద ఎత్తున గెలుపు సాధ్యమైంది అని చంద్రబాబు పేర్కొన్నారు.