దాసోజు శ్రవణ్ కి పౌరుషం…సిగ్గు లేదు – రోహిన్ రెడ్డి

దాసోజు శ్రవణ్ కి పౌరుషం…సిగ్గు లేదని మండిపడ్డారు రోహిన్ రెడ్డి. పార్టీలు మారడం దాసోజు నైజమని.. ఇదే వేదిక మీద బీజేపీ నీ తిట్టి..ఇప్పుడు బీజేపీ లోకి వెళ్తున్నారని నిప్పులు చెరిగారు. పదవులు రాకున్నా…మేము పార్టీ మారలేదని.. 2018 లో ఖైరతబాద్ కి నీకు ఏంటి సంబంధం అన్నారు. నాకు రావాల్సిన టికెట్… నికు వచ్చిందని.. ప్రజల తో సంబంధం లేని నాయకుడు అని మండిపడ్డారు.

నియోజక వర్గం ఎక్కడి వరకు ఉందో తెలియదని.. పాదయాత్ర చేస్తూ టోలిచౌకి కి వెళ్ళిండని నిప్పులు చెరిగారు. అంజన్ కుమార్ యాదవ్ నీ ఓడగొట్టడం కోసం ఏం చేశావో మాకు తెలియదా..? ఖైరతబాద్ లో బీసీ నాయకుడి కోసం డబ్బులు తీసుకున్న ది నిజం కాదా..? అని నిలదీశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి… బయట పెట్టాలా..? నీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు… రక్త మాంసాలు కరిగేలా పని చేశారని నిప్పులు చెరిగారు. . ఫిలిం నగర్ లో 13 ఎకరాల ఆంజనేయ స్వామి భూమి అక్రమాలపై ఒక్క రోజు మాట్లాడి వదిలేశాడని.. ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయి అనేది తెలియదా..? అని ఆరోపించారు.