తాత్కాలికంగా నీరు నిలిచే ప్రాంతాలను కూడా జలమయం అనే పదాన్ని ఉపయోగించవద్దని అన్నారు మంత్రి కేటీఆర్. వర్షాలు తీవ్రంగా ఉన్న సమయంలో నీరు వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని.. ఎప్పటికప్పుడు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మునిగిపోయిందని చూపిస్తూ నగర ఇమేజ్ ని దెబ్బతీయ వద్దని కోరారు. మరోవైపు ప్రమాదకరంగా మారిన కడెం ప్రాజెక్టు పరిస్థితిపై తనకు అవగాహన లేదని తెలిపారు కేటీఆర్.
ఎక్కడైనా భవనాలు శిథిలావస్థలో ఉంటే జనం అక్కడి నుండి తరలిరావాలని సూచించారు. కల్వర్టులు, బ్రిడ్జిలు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వాటిని గుర్తించి సమాచారం ఇస్తే.. వాటి వల్ల నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. ఇక వర్షాలు తగ్గాక అట్టు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్ ను ఆదేశించామన్నారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని.. ప్రభుత్వం హై అలర్ట్ గా ఉందని అన్నారు.