తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో , వాతావరణ శాఖకు కూడా అందని రీతిలో వరుణుడు తెలంగాణపై పగబట్టాడు. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం స్కూల్స్ , కాలేజీలు మరియు కంపెనీ లకు మూడు రోజుల పాటుగా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వాస్తవారణ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం నుండి పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనితో మళ్ళీ నెత్తిన బాదుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి మరియు సిరిసిల్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది.
ఇక భద్రాద్రి, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతాయట. ఇక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.