విదేశాల్లో ఉద్యోగాలు అంటే నమ్మకండి.. సైబర్ నేరాలపై వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్..!

-

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రజలకు సామాజిక అవగాహాన కలిగించేలా ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతుంటారు. ఈ నేపధ్యంలోనే ఇవాళ సజ్జనార్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దీనిలో సైబర్ నేరాలు చేస్తున్నారనే నెపంతో శ్రీలంకలో 137 మంది భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారని ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. దీనిపై విదేశాల్లో ఉద్యోగాలంటే నమ్మకండి. మీ ఉద్యోగ ఆశను అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుని నట్టేట ముంచుతున్నారని నిరుద్యోగులను అలర్ట్ చేశారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి.. సైబర్ నేరాలు చేయిస్తున్నారని, ఇటీవల కంబోడియాలో నిరుద్యోగ యువత వారి వలలో చిక్కుకుని నరకం చూసిన విషయం బయటకు వచ్చిందని గుర్తుచేశారు. తాజాగా అలాంటి ఘటనలే శ్రీలంకలోనూ జరుగుతున్నాయని, సైబర్ నేరాలు చేస్తున్నారంటూ దాదాపు 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారని తెలియజేశారు. ఉద్యోగాల కోసం దళారులను సంప్రదించి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని, వారి మాయమాటల్లో పడి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news