భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఆ పనులు కూడా..!

ప్రస్తుతం కరోనా తర్వాత హాట్ టాపిక్ డ్రగ్స్ మాఫియా.. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఇప్పుడు అందరూ ఈ అంశంపైనా దృష్టిపెట్టారు. పోలీసులు ఎన్నిదాడులు చేసినా హైదరాబాద్ లో ఇల్లీగల్ పనులు ఆగటం లేదు. భాగ్యనగరంలో భారీ బందోబస్తు పెట్టినా డ్రగ్స్ ముఠా పని పట్టలేకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయటానికి ప్రముఖ టీవీ ఛానల్ ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ చార్లీ’ ద్వారా కీలక ఆధారాలను సేకరించి సీపీ సజ్జనార్ కు అందజేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో రోజూ ఏదో ఒక మూల గంజాయి పట్టుబడుతూనే ఉంటుంది. యువతను చిత్తు చేస్తున్న మత్తు పదార్థాలకు గల్లీకి ఓ బ్యాచ్ బానిసలుగా మారాయి. పోలీసులు కంట పడకుండా తమ పని కానిచ్చేస్తున్నారు.

తాజాగా నగరంలో డ్రగ్స్ దొరకటంతో ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చినట్లైంది. అయితే ఈసారి పట్టుబడిన ముఠా డ్రగ్స్ సరఫరాతో పాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. పక్క రాష్ట్రాలను నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లోని యువతులను తీసుకువచ్చి వారితో ఈ పాడుపని చేయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మత్తెక్కించే డ్రగ్స్ వేసుకుని అందమైన అమ్మాయిలతో స్వర్గాన్ని తలపించేలా యువత ఆనందిస్తున్నామనుకుంటూ.. తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయం వారికే తెలిసే లోపే అంతా అయిపోతుంది. లక్షల్లో డబ్బు ఖర్చుపెట్టి మరీ ఈ ఆనందం కోసం దారులు వెతుకుంటున్నారు .

ఈ యువతుకు విటులకు డ్రగ్స్ సరఫరా చేయిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నుంచి 200 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక నైజీరియన్ నుంచి సమాచారం అందడంలో పోలీసులు ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ముఠా ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్‌ను ఇక్కడికి తెచ్చి.. తెలుగు రాష్ట్రాల్లో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ లిస్ట్‌లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. సమగ్ర విచారణ చేపట్టి పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు వెల్లడించారు.