BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఇంటిలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు.తెల్లవారుజామున భూమి కంపించడంతో అందరూ గాఢ నిద్రలో వున్నారు. భూమినుంచి శబ్దాలు రావడంతో భయాందోళలనతో ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. అందరూ రోడ్డుమీద ఉండి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.