నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్

-

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు.

అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు.. మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.. నాపై కేటీఆర్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్లలో నాకు పరపతి ఉందో, లేదో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని సవాల్‌ చేశారు రఘునందన్ రావు.

అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు.. సద్విమర్శలు చేయొచ్చు కానీ.. రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ‘దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిలా మారింది. తెలంగాణలో ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణ… దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది. రైతులకు సలాం చెబుతున్నాను. కరోనా సమయంలో పనిచేసిన వైద్య సిబ్బందికి సలాం. తెలంగాణలో కరెంట్‌ కష్టం లేదు.. తాగునీటి తిప్పులు లేవు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదు. దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉంటుంది. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది.. నియమాకాల కల సాకరం అవుతోంది.’ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news