నల్గొండలో దారుణం: బాలుడిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..

-

రోజురోజుకు మానవసంబంధాలు దిగజారిపోతున్నాయి. కామాంధులు వావీ వరస, చిన్నా పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.లింగ భేదం లేకుండా కొందరు కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు.ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి కూడా రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం లేదు. ఇంకా రెచ్చి పోయే ప్రవర్తి స్తున్నారు.

తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడి పై 60 ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడిని తాత లా చూసుకోవలసిన వృద్ధుడు ఆడుకుంటున్న ఆ బాలుడి ని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news