బీసీ కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం

-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18 తీసుకొచ్చినట్లు తెలిపారు. 60 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని అన్నారు. బీసీ కులగణన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఉంటాయని స్పష్టం చేశారు. 60 రోజుల పాటు జరిగే ఈ కులగణనకు రాష్ట్ర ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా కులగణనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. 60 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ  కలిసి అందరి వివరాలను సేకరించేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియలో ప్రధానంగా ఐదు అంశాలపై  దృష్టి పెట్టనున్నది. ఒకవైపు కులాలవారీగా వివరాలను సేకరించడంతో పాటు ఈ ఐదు అంశాలపై సమగ్రమైన డాటాను తీసుకోనున్నది. విద్య, ఉపాధి  సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనకబాటుతనానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నది.

Read more RELATED
Recommended to you

Latest news