మంకి పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమావేశం

-

గతంలో కరోనా మహమ్మారీ ప్రపంచ వ్యాప్తంగా  ఎంతటి సంచలనం సృష్టించిందో దాదాపు అందరికీ తెలిసిందే. ఇక  ప్రస్తుతం ప్రపంచాన్ని గఢ గడలాడిస్తోంది మంకిపాక్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటివరకు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ ప్రభుత్వాలు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంకీపాక్స్ పై అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ.. రోగులను జాగ్రత్తగా మానిటర్ చేయాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కిట్స్, మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.  ప్రతి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మంకీపాక్స్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి దామోదర రాజనర్సింహా. మంకీపాక్స్ రాక ముందే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.. వచ్చాక ఇబ్బందులు పడేకంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదని వైద్యులకు సూచించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version