త్వరలోనే బిఆర్ఎస్ లో భూకంపం వస్తుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. బలవంతంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని తెలిపారు. కేసీఆర్ ఎదురుపడితే నవ్వుతూ నమస్కారం పెట్టే సంస్కారం తనకు ఉందని పేర్కొన్నారు.
అధికారం ఎవరీ శాశ్వతం కాదు, బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త,చిల్లర వేశాలు మాని,ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనస్సు గెలువాలి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసులకు భయపడరని హెచ్చరించారు. నా నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడు.అందుకే చాలా మందికి హుజూరాబాద్ లో లైసెన్స్ తుపాకులు ఇచ్చారు.పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తోత్తులుగా మారారని,మా నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.