తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఈటల రాజేందర్‌ !

-

Etala Rajender as president of Telangana BJP: బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సైతం మార్చనున్నట్లు జాతీయ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Etala Rajender as president of Telangana BJP

ఇక ఇదే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..మాట్లాడుతూ….పార్లమెంటు ఎన్నికలకు ముందు జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవి కాలాన్ని పొడిగించారని వెల్లడించారన్నారు. జెపి నడ్డా టర్మ్ పూర్తయింది…అందుకే జెపి నడ్డా కేంద్ర క్యాబినెట్ లోకి వచ్చారని వివరించారు.

తొందరలోనే బిజెపి అఖిల భారత్ అధ్యక్షులుగా కొత్త వాళ్ళను ప్రకటిస్తారని చెప్పారు. తెలంగాణ లో కూడా కొత్త వాళ్ళను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటిస్తారని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త అధ్యక్షుడు ఎవరనేది… తర్వలోనే తెలుస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news