బీసీల కోసమే.. 250 రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బాలాజీ నగర్ లో విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాలాజీ నగర్ కాలనీకి మూలనికి ప్రధాన కారకుడు టైగర్ నరేంద్ర గారు అన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని వందల మంది నా దగ్గరకు వచ్చేవారు. ఆ ఛాంబర్ చెమట వాసన వచ్చేదన్నారు.
మా డిపార్ట్మెంట్లో ఒకరు వచ్చి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ లేక కూరగాయల మార్కెట్ అన్నారు. మేము ఒక సంతకం పెట్టించుకుందామంటే మాకు టైం దొరకడం లేదు. ఆరోజు నేను ఒకటే అన్నాను మా డిపార్ట్మెంట్లో చెమట వాసన వస్తుందని నువ్వు చెప్పినందుకు గర్వపడుతున్నాను. ఇది పేదలకు ఒక అడ్డా.. పేదలకు ఒక భరోసా కేంద్రమని సంతోష పడ్డానని వివరించారు.
తెలంగాణలో అన్ని హాస్టల్లోకి, అన్ని ప్రభుత్వ స్కూళ్ళకి అందరికీ సన్న బియ్యం, కడుపునిండా అన్నం పెట్టే జీవో ఇచ్చింది నేను అని వెల్లడించారు. ఈటల రాజేందర్ అనేటోడికి అధికారం వస్తే ఎవరికి చెప్పకుండా, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అర్థం అయింది కాబట్టి, 40 రోజులపాటు మా వాళ్లను అసెంబ్లీకి పిలిపించి, నేనే భోజనాలు పెట్టించి… వందకు పైగా కులాలను ఆదుకుంటేనే రేపు భవిష్యత్తు అని, ఈ జాతులను ప్రభుత్వాన్ని లింక్అప్ చేసిన బిడ్డను నేను అన్నారు.
ఒక్క బీసీల కోసమే 250 రెసిడెన్షియల్ స్కూల్స్ కు జీవో ఇచ్చిన వ్యక్తిని నేను.,,సంచార జాతి పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్కూల్స్ లో అడ్మిషన్ ఇచ్చింది నేనని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల.