కాంగ్రెస్ రుణ మాఫీ పచ్చి అబద్దం..!

-

మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా.. ఈ ఒక్కవిషయంతోనే కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది అని హరీష్ రావ్ అన్నారు. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి..? ఏటిలో దుంకి ఎవరు చావాలి..? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో BRSను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాపఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పండో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను అని హరీష్ రావ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version