బీజేపీలో ఉంటే సీతను.. కాంగ్రెస్‌లో చేరితే రావణుడినయ్యానా..? : వివేక్‌ వెంకటస్వామి

-

మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఇటీవల ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దాడులపై ఆయన స్పందించారు. కేసీఆర్, అమిత్ షా నేతృత్వంలోనే తనపై ఈడీ దాడులు జరిగాయని వివేక్ ఆరోపించారు. బీజేపీలో ఉన్నప్పుడు సీతలా కనిపించిన తానూ.. కాంగ్రెస్​లోకి రాగానే రావణుడిలా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్‌, మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ భూములకు సంబంధించి ఆయనకు రూ.27 కోట్లు ఇచ్చినట్లు వివేక్ తెలిపారు. “లావాదేవీలన్నీ చట్టప్రకారం జరిగినా ఆ భూముల వ్యవహారంలో నాకు నోటీసులు ఇచ్చారు. ఆ భూములున్న రాజేందర్‌కు నోటీసులు ఎందుకివ్వలేదు? 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు ఆర్థికసాయం అందించాను. అలాంటి వ్యక్తి నేడు రూ.వేల కోట్లు సంపాదించారు. ఇటీవల నా కంపెనీలో షేర్ల అమ్మకం ద్వారా రూ.50 కోట్ల లాభం వచ్చింది. దాంట్లో రూ.9 కోట్లు పన్నులుగా చెల్లించాను. ఈ మధ్య నా మిత్రుడు యశ్వంత్‌ రెడ్డికి చెందిన రూ.20 లక్షల విలువగల కంపెనీ రూ.200 కోట్ల లావాదేవీలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటికీ నాకు ఎటువంటి సంబంధం లేదు.” అని వివేక్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news