తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఫస్టియర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

-

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్ ఫస్టియర్‌ ప్రవేశాల గడువు పొడిగించింది ఇంటర్‌ బోర్డు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు జూన్ 30తో ముగిసింది. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం వంటి కారణాలతో గడువును పొడిగించినట్లు సమాచారం. ఇక ఇటు తెలంగాణ పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ శనివారం ప్రారంభమైంది. నిన్న 994 మంది స్టూడెంట్స్ స్లాట్ బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సోమవారం వరకు అవకాశం ఉంది. ఈనెల 7న విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version