రుణమాఫీ జరగలేదని రోడ్లపై మూళ్ళ పొదలు వేసి రైతుల నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో రుణమాఫీ జరగలేదని.. రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ముళ్ళ పొదలను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. ఇక అటు నుండి వెళ్తున్న బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సైతం రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నాడు.
రైతుల పక్షపాతి అని వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవి నుండి తొలగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు రుణమాఫీ కానీ రైతులు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.