ఫిల్మ్ నగర్ దంపతుల హత్యకేసు చేదించిన పోలీసులు

-

ఫిల్మ్ నగర్ దంపతులు ఫాతిమా & ఖాద్రీ హత్యకేసు చేదించినట్టు సీఐ రామ కృష్ణ మీడియాకి వెల్లడించారు. ఇవాళ మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో  ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసాము అందులో A1) మహమ్మద్ అస్గర్.. A2) మహమ్మద్ సమీర్  A3) మహమ్మద్ సల్మాన్. గొర్రెల వ్యాపారం ఫామ్ పెట్టిస్తామని నిందితుడు మహమ్మద్ అస్గర్ వద్ద మృతులు 20 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు.డబ్బుల విషయలో వీరి మధ్య గొడవ  అయింది. దీంతో నిందితులు దంపతులను రెక్కీ చేసి హత్య చేశారు. నవంబర్ 28న ఖాద్రీ నీ మొదట కిడ్నాప్ చేసి హత్య చేసారు.  ఈ విషయం ఎక్కడ ఫాతిమా బయట పెడతుందోనని  నవంబర్ 29న ఫాతిమా హత్య చేసారు. మృతురాలి చెల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశాం. 

- Advertisement -

400 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. A1 మహమ్మద్ అస్గర్ మనికొండ వాసి నగరంలో స్థిరపడ్డాడు. హత్య అనంతరం మహమ్మద్ అస్గర్ ముంబయ్ పరార్ అయ్యాడు. హత్య తరువాత ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యారు. మృతురాలు ఫాతిమా రెయిన్ బో హాప్సిటల్ లో డైటిషియన్ గా పనిచేస్తుంది. భర్త ఖాద్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి, గొర్రెల వ్యాపారం కూడా చేస్తాడు. మనికొండలో A3 మహమ్మడ్ సల్మాన్ నీ సీసీ కెమెరాల్లో గుర్తించి విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...