కోదాడ వరదల్లో చిక్కుకున్న 400 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది..!

-

జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది సీతారాం తండా. అలాగే ధర్మవరం గ్రామంలోని వందలాదిమందిని రెస్క్యూ చేసారు ఫైర్ సిబ్బంది. వరదలో చిక్కుకున్నవారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 13 మేజర్ రెస్క్యూ ఆపరేషన్లు పూర్తి చేసారు. కోదాడలో వరదలో చిక్కుకున్న 400 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది.. ములుగు కొండవాయిలో 150 మందిని రెస్క్యూ చేసి రక్షించింది సిబ్బంది. ఖమ్మం జిల్లా మున్నేరు వద్ద ఆపరేషన్ స్టార్ట్ చేసారు. ఇప్పటివరకు మొత్తం 670 మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది.

కోదాడలో 400 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది.. మహబూబాబాద్‌లో 150 మందిని కాపాడాం అని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అలాగే సీతారామ తండాలో వంద మందిని రక్షించగలిగాం. ఖమ్మంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఆపరేషన్ చేసేందుకు కొన్ని ఆటంకాలున్నాయి అని తెలిపారు ఫైర్ డీజీ. కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఖమ్మం పంపిస్తున్నాం. హైదరాబాద్‌, వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాలనుంచి ప్రత్యేక బోట్లను ఖమ్మం పంపుతున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ఖమ్మానికి చేరుకుంటున్నాయి.ఇప్పటికే ఖమ్మంలో రెస్క్యూ ఆపరేషన్‌ మొదలెట్టాం. అందర్ని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news