తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

-

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో హైదరాబాద్ నగరంలోని యశోదా ఆస్పత్రిలో ఆయన చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రోజున ఉదయం తుది శ్వాస విడిచారు. శాంతి సర్వూర్ మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలుగు మీడియాలో ఆయన పనితీరును గుర్తు చేసుకున్నారు.

తెలుగులో తొలిసారి వార్తలు చదివిన శాంతి స్వరూప్.. మీడియా రంగంలో చెరగని ముద్ర వేశారు. పదేళ్లపాటు టెలీ ప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు శాంతి స్వరూప్.  1983 నవంబర్‌ 14వ తేదీ నుంచి ఆయన దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శాంతి స్వరూప్. 2011లో పదవీ విరమణ చేసే వరకు ఆయన దూరదర్శన్‌లోనే పని చేశారు. తన పనితీరుకు నిదర్శనంగా ఆయన లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news